Posts

Showing posts from February, 2020

కవుల కనీనికలు

సమస్యాపూరణము సమస్య: చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్

నలుగుతున్న మనస్సులు

సమస్యాపూరణం: "పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు

సమస్యాపూరణం తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

అంతర్జాల రత్నాకరము

సమస్యాపూరణం అత్తకు మీసముల్ మొలిచె అల్లుని చిత్తము నాట్యమాడగన్

సమస్యాపూరణం

సమస్యాపూరణం రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

ప్రాణమా! నీకో విన్నపం

హర్షణీయం

ఆకాశవాణి వారి సమస్య

మనస్సు

శివమగుపాపకార్యములజేసినచో.......

సమస్యాపూరణ మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై ఉత్పలమాల కోరెనుభార్యగాతనకుకోమలినొక్కతెజూపుమంచుఁదాన్ దీరుగమంత్రగానిగనిధీరుడునాయువకుండునంజనం బారయుమంచురాసెఁగనుపట్టునటంచునుజూడఁదీక్షగాన్ మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై గాదిరాజు మధుసూదన రాజు

క్షీరం........................................ ఆవైనా మేకైనా మరేజంతువైనా మానవకాంతైనా అమ్మతనం పొందితేనే పాలధార పొంగేది అమ్మకు దేవుడిచ్చిన వరం క్షీరం అమ్మ బిడ్డకై ఇచ్చేవరం క్షీరం తొలిఆకలిని తీర్చే ముఱ్ఱుపాల ఊట రోగాలను అడ్దగించే ఆరోగ్యశక్తుల కంచెకోట గాదిరాజుమధుసూదనరాజు

సమస్యాపూరణం కై సమస్య: రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్ మత్తేభము రసికుల్ బొందగతీపిజబ్బురతికార్యస్థాయిహీనంబగున్ పసురుల్ ద్రావుచుపథ్యముల్ నెఱపదీప్తంబౌనుతచ్ఛక్తియున్ వెసఁబెంచున్ మధుమేహమున్ కదళినిర్వీర్యంబగున్ దేహముల్ రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్ గాదిరాజు మధుసూదన రాజు

చీపురు

సమస్య.. యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్ ఉత్పలమాల యోగులఁప్రస్తుతింపఁఘనయోగులెగావలెరావలెన్ వృథా బ్లాగులముఖ్యయోగులనిపట్టికలిత్తురుధ్యానరాజస ద్యోగులువీరలేయనియయోగ్యులయోగ్యులయోగులంచు నా యోగులలోన వేమన యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్ గాదిరాజు మధుసూదన రాజు

పుష్పకవిమానం ..రైలు .................................... గమ్యాన్ని దరిజేర్చే ప్రయాణీకుల వసతిగృహం నేలపై పరుగులుతీసే సామాన్యుల పుష్పకవిమానం కదులుతున్న ఇంటివరుసలు పట్టాలెక్కిన అవసరాలు పట్టాలెక్కితే రైలుపెట్టెలు చుట్టాలతో..చెట్టపట్టాలు డిగ్రీపట్టాకై ప్రయాణం రైలుపెట్టెదే సహాయం ఆగనిదమ్మా జీవనయానం రైలేదైనా తప్పదు పయనం గాదిరాజు మధుసూదనరాజు

సమస్యాపూరణలు ॥ శ్రామికులవాడలోలల నామణికిన్ ప్రసవవేదనల్ మొదలయ్యెన్ క్షేమమెఱిగిముత్తైదువ భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్" గాదిరాజు మధుసూదన రాజు ప్రేమగనత్తగారుపిలిపించెనుకోడలునొప్పులన్ బడన్ శ్యామలమంత్రసానిఁ బరిచర్యలుసేసెనుశక్తిమీరగన్ భామను వైద్యురాలినటు భర్తయుపిల్చెనుకాన్పుఁజేయగన్ భామయు భామయున్ గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్ గాదిరాజు మధుసూదన రాజు

బాధాకరం(కవిత) .......................................... ..........,........ అంతులేనంత నీరున్నా . దాహాన్ని తీర్చలేనంతగా కాలుష్యంతో నిండిన దౌర్భాగ్యం సముద్రానిది అంతులేనంత సంపాదనున్నా ఆప్యాయత పంచలేనంతగా నిర్లక్ష్యకాలుష్యంతో నిండిన కాఠిన్యం పుత్రహృత్సంద్రానిది విలువైనదే లోకానికెంతో మేలైనదే ............. అత్యద్భుతం రత్నాకరం అయితే నేం ? కడుపునకే ఆత్మీయదాహార్తి తీర్చలేకపోవటం...........అత్యంత బాధాకరం !! గాదిరాజు మధుసూదన రాజు

సమస్యాపూరణకు సమస్య "బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా" బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్ బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్ బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్ బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా గాదిరాజు మధుసూదన రాజు

సమస్యాపూరణ.... ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో ఉత్పలమాల పండితులున్ గ్రహింపసులభంబొకొవిశ్వఖగోళమట్టిబ్ర హ్మాండములండపిండములుమాయగనెంతురులేవటంచుఁదా నుండెవిరాట్స్వరూపిపురుషోత్తముడందురుసూత్రధారియై ఉండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో గాదిరాజు మధుసూదన రాజు

నమ్మకం .............. ఉన్నందుకే అమ్మకాలు కొనుగోళ్ళు ఒకవ్యాపారి వందల్లోకష్టమర్లు ఉన్నందుకే మొక్కడాలు ముడుపులచెల్లింపులు ఒక్కపూజారి వేలల్లో భక్తులు నాస్తికులైనా ఆస్తికులైనా నమ్ముకోవలసిందినమ్మకాన్నే క్రమ్ముకోవలసింది సంఘాన్నే!! గాదిరాజు మధుసూదన రాజు

గుండెపగిలేంత ఆత్రం ..................... సమయాన్ని లెక్కించే నాకు నిముషాలు కూడా గడవకుండా మొండికేసి విసిగిస్తాయని నాకు తెలిసిందెప్పుడంటే.... నా మనసులోని మాటచెప్పాలని నీ కోసం నేను ఒంటరిగా ఖాళీ చేతులతో ఊరి బయట మైదానంలో నీవు చెప్పిన సమయానికన్నా ఓ రెండు గంటలు ముందు చేరుకున్నప్పుడు! గుండెపగిలేంత ఆత్రంతో ఎదురుచూసి నప్పుడు!! గాదిరాజు మధుసూదన రాజు

పూరించవలసిన సమస్య "బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్" పొంగెన్ బ్రేమలునిండెచుట్టములతోపుల్లయ్యపూరిల్లహో గంగాచిట్టివిపుట్టువెంట్రుకలొసంగన్ పుట్టనాగమ్మకున్ సింగారించెనుపూజఁజేసెనటుదీసెన్ మట్టినా పుట్టపై బంగారమ్మును పేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్ గాదిరాజు మధుసూదనరాజు పుట్ట పై మట్టిని పుట్టబంగారమని భక్తులు నుదుట ధారణ చేయటం రాయల సీమలో పలుచోట్ల ఆచారంగా ఉన్నది

పూరింపవలసిన సమస్య ఇది... దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్ స్పష్టముగానెఱింగియపచారులటంచునుతామెసాక్షిగా దుష్టదురాగతంబులను దుందుడుకొప్పగజేయువారలౌ భ్రష్టులలంచగొండ్లుగుణవంతులటంచుధృవీకరింపగా దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్ (ఎలక్షన్ల సందర్భంగా అభ్యర్థుల ధృవీకరణ గురించి) గాదిరాజు మధుసూదనరాజు

పూరణకై సమస్య ఇది... "తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్ ఉత్పలమాల మండఁనిరంతరంబుననుమానముతోనుదరంబెయాకలిన్ మండలవైద్యుఁజేరఁనిజమౌమధుమేహవికారమేయనెన్ ఖండితమైనపథ్యవిధికట్టితినాల్కనుతన్నిషిద్ధమౌ తిండిని మానివేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్ గాదిరాజు మధుసూదనరాజు

పూరింపవలసిన సమస్య ఇది... "కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్" తలపన్ గ్రామముదాటిదీనులుదరిద్రావస్థలన్ మ్రగ్గుచున్ వెలివేయంబడిక్షుద్వ్యథార్థులయిజీవింపంగపోరాడువా రలుగుర్తింప వసింతురాహరిజనారామాలెగుళ్ళౌనుపా కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్ గాదిరాజు మధుసూదన రాజు

సమస్యాపూరణం సమస్య.... "పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ శ్మశానభూమికిన్ చంపకమాల: పలువురుగ్రామనాయకులప్రార్ఠనమేరకుపార్లమెంటుస భ్యులెయొసగన్ నిధుల్ జరిగిపోయెశ్మశానసహాయనిర్మితుల్ కులపువివాహవేదికయుకూడెనుపెద్దలుయంపిమూర్తినే పిలిచిరి పెండ్లిచూపులకు, వేడుక మీఱ శ్మశానభూమికిన్ గాదిరాజు మధుసూదన రాజు

సమస్యాపూరణము : సమస్య: తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్ .................................... తోడ్పడెఁజంపఁసైంధవునితోడ్పడెభీష్మునిద్రోణుఁజంపగా నూడ్పఁగురుప్రకాండులనుయోధులకర్ణసుయోధనాదులన్ తోడ్పడెముందుయోచనలతోడఁబ్రయత్నఫలమ్ముతోడనే తోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్ గాదిరాజు మధుసూదన రాజు

ఆకాశవాణి హైదరాబాదు వారి జనవరి 25, 2020 9:59 PM వచ్చే వారానికి ఆకాశవాణి సమస్యాపూరణ కి సమస్య *మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే* మత్తకోకిల మంచిచేయగ నేత జూడగ మానవాళి సుఖింపగన్ లంచగొండులు పొంచియుండగ రాచకార్యపుదార్లలో నెంచి జాగ్రత మాయగెల్వగ నించుకైన తలంపరే మంచివారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే గాదిరాజు మధుసూదనరాజు తాడిపత్రి .అనంతపురంజిల్లా