ప్రాణమా! నీకో విన్నపం

ప్రాణమా! నీకో విన్నపం!!
...............................
నాలో నీవున్నావని
నేను తెలుసుకొనేప్పటికే..
అందరిలో నీవున్నావని
తెలిసిపోయిందినాకు!

అప్పుడే...
నన్నుప్రేమిస్తున్న వారిలో వున్ననీకంటే...
నాలో వున్ననీవు
నాకు ముఖ్యంకాదని అనిపించింది నాకు.

నాకు తెలీకుండా
నాలోకి దూరిన నీవంటే
నాకు చులకనే మరి!

అయినా.....

నేనిష్టపడేవారిని
నడిపిస్తున్న  నీవు మాత్రం..

వదలకుండా పదిలంగా
కలకాలం ఉండాలి మరి!!

నేను ప్రేమించే
తనువుల్లో నున్న నీకోసం...
తెగిస్తున్న నన్ను   ...ఆపేస్తూ

నన్నుకన్నోళ్ళు నన్నుకట్టడిచేయటం
నాకేమాత్రం  నచ్చట్లేదు

అట్లే....

నాలో నీవున్నంత వరకూ...
నా అన్నవారినుంచినీవు..
విడిపోయివెళ్ళిపోవటం...
నాకే మాత్రం నచ్చట్లేదు!

అందరిప్రాణం నీవుకదూ!
మాబుజ్జివి కదూ!
రావటం పోవటం నీ ఇష్టమేనా?

మనసుపడే నీ మనిషి కోసం!
మథనపడే నీ మనసుకోసం!!

ఉదారంగా ఉమ్మడిగా
కలిసిఉండిపో.. అందరితో...

గాదిరాజు మధుసూదన రాజు
----------------------------------------


హామీ పత్రము

ఆర్యా

ఈ కవిత"ప్రాణమా!నీకో విన్నపం!!"
 నాస్వీయరచన .అనువాదంకాదు.
అనుసరణకాదు.
ప్రచురణకు స్వీకరిస్తారని ఆశిస్తాను.
                          ఇట్లు
   గాదిరాజు మధుసుదన రాజు

Comments

  1. అదిఇదీచేయొద్దంటూపదములనురికించేసి
    పలికించినహృదయఘోషమదిలోఇరికించేశావ్
    కదిలించినతీరుఅద్భుతం
    పద్మార్పితవారి కవిత్వం సంచలనాత్మకం!!"

    పద్మార్పిత వ్రాసే తవికలు ఏమి బాగున్నాయి. అందులో సంచాలనాత్మకం ఏముంది. బూడిద. మీరు పిచ్చి తవికలు పొగడటం ఎబ్బెట్టు గా ఉంది.

    ReplyDelete
    Replies
    1. మీరు సాహిత్యవిమర్శకులు కావున సునిశిత విమర్శనా దృష్టితో చూశారు. మీ విమర్శనాత్మకపరిథి.. అవార్డులకోసం పారామీటర్లను పరిగణనకు తీసుకునేంత విస్తృతమైనది కాబట్టి మీకు అలా
      అనిపించియుండవచ్చు.
      నేను తెలుగుపలుకుల అభిమానిని
      నాకు నచ్చింది.నా అనుభూతికి అలాంటి ఆనందపుపలుకులు నా కలం నాలుక అప్రయత్నంగా పలికింది(రాసింది)..అంతే!

      Delete
  2. మీరు సాహిత్యవిమర్శకులు కావున సునిశిత విమర్శనా దృష్టితో చూశారు. మీ విమర్శనాత్మకపరిథి.. అవార్డులకోసం పారామీటర్లను పరిగణనకు తీసుకునేంత విస్తృతమైనది కాబట్టి మీకు అలా
    అనిపించియుండవచ్చు.
    నేను తెలుగుపలుకుల అభిమానిని
    నాకు నచ్చింది.నా అనుభూతికి అలాంటి ఆనందపుపలుకులు నా కలం నాలుక అప్రయత్నంగా పలికింది(రాసింది)..అంతే!

    ReplyDelete
  3. క్షత్రియ సాహిత్యం ఉందాండి :)

    ReplyDelete

Post a Comment