నలుగుతున్న మనస్సులు

నలుగుతున్న మనస్సులు

...............



నలుగుతున్నమనస్సులు

నలిపేస్తున్నదికూడామనస్సులే!



నలుగుతున్నమనస్సుకొడుకుదైనప్పుడు ఒకలా



తాళికట్టిన భర్తదైతే మరోలా



బిడ్డమొగుడుఅల్లునిదైతే ఇంకోలా



వ్యాఖ్యానాలుచేస్తుంది ఆడమనసు రకరకాలుగా....



ఆడమనస్సంతే ...



న్యాయానికి అర్థంకాని మమకారపుమాయలా



అమ్మలా ఒకలా,

ఆలిలా ఒకలా,

అత్తమ్మలా ఒకలా



భరించటానికైనా

నిరసించటటానికైనా

వీలుకాని అమ్మతనపు పిచ్చిలా

ఇంటింటా ఒకేలా....



గాదిరాజు మధుసూదన రాజు

Comments

  1. మహిళా దినోత్సవం రోజున మహిళలకు అభినందనలు చెప్పటం కాదు, మన చుట్టూ ఉన్న మహిళలను గౌరవిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షించే బాధ్యత పురుషుల పైన మహిళ పైన ఉంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న దానికి నిదర్శనమే కవిత అభినందనలు

    ReplyDelete

Post a Comment