శివమగుపాపకార్యములజేసినచో.......

పూరింపవలసిన సమస్య ఇది...

"శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా

చంపకమాల

ధృవమిదిమూర్ఖమర్త్యులుమదించిచరించుచుజ్ఞానశూన్యులై
భువినిననేకదుర్వ్యసనభోగపరాయణులైనభ్రష్టులున్
శివయనమోక్షమబ్బునభిషేకముచేనఘధౌతమౌనికన్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా

గాదిరాజు మధుసూదనరాజు

Comments