అతడే!

"ఏమనుకోనూ...నిన్నేమనుకోనూ?" (కథ)

రచన: గాదిరాజు సందీప్ వర్మ


అదో  చిన్న టీకొట్టు.
గుడిసె స్తంభానికి కాయిన్ బాక్సుటెలిఫోన్  వ్రేలాడుతోంది.
గుడిసెలోపల బ్లాక్ అండ్ టీవీ లో   బొమ్మల కదలికలు స్పష్టంగానే కనిపిస్తున్నాయ్ .

"మై నేమ్ ఈజ్ ఆశ!  మై నేమ్ ఈజ్ ఆశ!   "
పుస్తకం నేలపై పెట్టుకొని గట్టిగా చదువుకుంటోంది.

"ఏయ్ పిల్లా చదివింది చాలు గాని ..
మాకు చాయ్ లు అందించు.."
అరిచాడో ముసలాడు చెక్కబెంచిపై కూలబడుతా.

"మా డాడీ ఇస్తాడులే తాతా!
నేను బాగా చదువుకోవాలి .చదువుకోని పెద్దడాక్టర్ ని అయ్యి మా డాడీకి పెద్దహోటల్ కొనియ్యాలి!
చచ్చిపోయేటప్పుడు మా మమ్మీ చెప్పింది తాతా బాగా చదూకోమ్మని."

"ఒరేయ్ వెంకటేష్! ఏరా !నీ కూతురు శానా అతి మాటలు మాట్లాడు తావుందిీ?"

"దాని మాటలకేమిగాని నీవు చాయ్ తీస్కోబాబాయ్.
పిల్ల కి కాన్వెంటు ఫీజు కట్టాలి ఓ వెయ్యి సర్దు   వడ్డీతో కలిపి  రోజుకింత కడతా "
అంటూ అందించాడు వెంకటేష్ .

"ఇదిగో టీ డబ్బులు " 
అంటూ అందించిన పాతికేళ్ళ కుర్రాడిచెేయి వైపు ముఖం వైపు మరోమారు కళ్ళెత్తి చూశాడు వెంకటెష్ ,కుర్రోడు సినిమాహీరోలా నాజూకుగా కనిపించటంతో .

** **                       **             **

దాక్కోవటానికి పొదలవైపు పరుగెడుతున్నాడు చిన్నారి మృదుకర్ చిలిపిగా నక్కుతూ.
మమ్మీడాడీలకు దొరికిపోగానే ముద్దుగా కేరింతలుకొడుతూ వాటేసుకుంటూ
ముద్దులుపెట్టించుకుంటూ తిరిగిముద్దులుపెడుతున్నాడు.

వెంటపరుగెడుతున్న మమ్మీడాడీలకోసం వెనుకకు తిరిగిచూస్తూ మళ్ళీ పరుగు మొదలుపెట్టాడు మళ్ళీ కేరింతలు ముద్దులు ఊహించుకుంటూ.

అలా
దాక్కున్నాడు దాక్కున్నాడుదాక్కున్నాడు
ముసిముసినవ్వులతో పొదల్లో
నిముషాలు గడిచి గంటలైపోయేసరికి..
బయటకు వచ్చి చూచాడు.
కేరింతలు కొట్టాడు గెలిచాననుకుంటూ..

ఉహూ..
అర్థంకాలేదు.
ఆ చిట్టిబుఱ్ఱకి
అటుఇటూ పరిగెత్తాడు...

దూరంగా పార్కుమధ్యలో 
గుమిగూడిన జనం  ...మధ్యలో  రెండు శవాలు

అవి వాడి మమ్మీడాడీలవే అని ..ఎవరో సైలెన్సరు బిగించిన గన్ తో కాల్చి చంపారనీ  తెలుసుకునేందుకు అర్థంచేసుకునేందుకు వాడి చిట్టిబుఱ్ఱకి శక్తి చాల్లేదు.

హృదయవిదారకమైన దిక్కులేని స్థితిలో 
మిగిలిపోయాడు  ఆ చిన్నారి మృదుకర్ ఆ సమయంలో.
** ***               ***                   ***
 ..
తన పుట్టినరోజు సందర్భంగా ..
రాజకీయరంగప్రవేశం చేస్తున్నానంటూ ప్రకటించటంతో..

ప్రముఖవ్యాపారవేత్త గా సినీ నిర్మాతగా కోట్లాది ప్రజానీకానికి సుపరిచితుడైన ధనపతిగుప్తా గారి ఇంటివద్ద వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారింది.

పాలకపక్షప్రతినిధులు ప్రతిపక్షప్రతినిధులు పక్షుల్లా అక్కడ వాలిపోయారు.
సినీప్రముఖుల ప్రమేయంతో సినీఅభిమానులుకూడా 
కలిసివస్తూండటంతో మరింతగా ఆనాటి  ప్రాముఖ్యత మరింతగా   పెరిగి పోయింది.

***          **        ***

"మైగాడ్ "
అంటూ అరిచాడు ఆనందరావు.
హరాత్తుగా అందరి కళ్ళూ టిీవీ వైపుకు మరలాయి.
"ధనపతిగుప్తా దారుణ హత్య"
అంటూ టివీ ఛానల్ లో పదే పదే చూపిస్తూన్నారు.

సి సి కెమెరాలో రికార్డయిన దృశ్యాలు చూపిస్తున్నారు.
దృశ్యంలో కనిపిస్తున్న హంతకుని ఆచూకీ తెలిపిన వారికి యాభైలక్షలు ఇస్తానంటూ ధనపతి కుమారుడు బహుమతి ప్రకటించేశాడు తన మొబైల్ నెంబరుతో పాటుగా.

సానుభూతిని ఓట్లవరదగా మార్చుకోవటం కోసం రాజకీయనాయకులు మెదళ్ళకు పదును పెడుతున్నారంటూ టివీలో వార్తలు ప్రసారమౌతున్నాయ్ .

"దుర్మార్గుడు.
రాక్షసుడు
క్రూరుడు"
"అన్యాయంగా పెద్దాయన్ని హత్య చేశాడు .ఇలాంటి వాడిని ఉరితీయాలి"
"చిత్రవధచేయాలి"
అంటూ టీవీ చూస్తూ తలో కామెంట్ చేస్తున్నారు ఆనందరావుగారి ఇంటిలోని వాళ్ళు.

"కెవ్వు "
మంటూ అరిచింది ఐశ్వర్య.

వేగంగా దూసుకొస్తున్న కారు...

కారు క్రింద పడుతున్న   బొచ్చుకుక్కపప్పీ....

పప్పీని కాపాడటం కోసం ఇంటిముందు నడిరోడ్డుపై  పరుగెడుతున్న  బర్త్ డే బేబీ ఆయుష్య  !

పిచ్చిగాగోలగోలగా కేకలువేశారంతా
అయినా..
ఆగకుండా  భయంకరంగా శబ్దం చేస్తూ.కారుదూసుకు పోయింది

ఘోరాన్ని చూడలేక ఆ తల్లి...
"దేవుడా ^ అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళుమూసుకుంది రెండుచేతులతో .

కళ్ళుతెరిచిచూసి 
రోడ్డుపై రక్తం మరకలు కనిపించటంతో 
కెవ్వుమంటూ కుప్పకూలింది  ఐశ్వర్య ఉన్నచోటే.

"దేవుడా అంటూ అరిచావు కదమ్మా !
అదిగో దేవుడు !
నీ పాపను కాపాడాడు చూడమ్మా!"అంటూ

రోడ్డు అవతల నిలబడ్డ యువకుణ్ణి చూపించాడు అనందరావు.
తన వొంట్లోంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పప్పీకి పాపకి అంటిన దుమ్ముని దులుపుతున్నాడు తన కర్చీఫ్ తో 

"నీవు నిజంగా దేవునివేనయ్యా చిన్నగాయంకూడా తగలకుండా పాపను పప్పీని కాపాడడావు"
అంటూ చేతులుజోడించాడు పాపతండ్రి చంచల్ రావ్ .
అంతలోనే ఏదోగుర్తుకు వచ్చినట్లు తండ్రి ఆనందరావువద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి.. మొబైల్ లో ఏదో చూపించి

"నాన్నా వీడే ఆ దుర్మార్గుడు హంతకుడు!
ఫోన్ చేసిచెప్తే యాభైలక్షలతో పాటు మాంఛి పబ్లిసటీకూడా వస్తుంది"
అంటూ నిట్టూర్పువిడిచాడు మంచి అవకాశం అన్నట్టుగా
" ఛీ ..ఇప్పుడే కదరా వాణ్ణిదేవుడన్నావ్ .హృదయంలేదా నీకు?లేక బుద్ధి గడ్డితినిందా?ఇంతనీచంగా ఆలోచిస్తున్నావేమిట్రా?మనసున్న మనిషిలా ఆలోచించు"
అంటూ ఛీదరించుకున్నాడు కొడుకుని ఆనందరావు అసహ్యంగాచూస్తూ అతనివంక చూస్తూ.

అతనికి వాళ్ళమాటలు అతని చెవిన పడినా ..పట్టించుకోకుండా నిర్లిప్తంగా అక్కణ్ణుంచి దూరంగా నడిచాడు.
కోటుజేబులోంచి రివాల్వర్ ని బయటకుతీసి అందులో మిగిలివున్న బుల్లెట్లను తీసి లెక్కపెట్టి మళ్ళీ లోడ్ చేస్తూ.
**       **         ** ***
బ్రిడ్జిపై నిలబడ్డాడతను.
తన జీవితంలో సాధించాల్సింది ఇంకేమీ మిగల్లేదన్నట్లు తృప్తిగా నిట్టూర్చాడు

చేతిలోకి తీసుకున్న రివాల్వర్ వైపు,పారుతున్ననీళ్ళ వైపు మార్చి మార్చి చూశాడు.

అంతలోనే ఏదోగుర్తుకు వచ్చినట్లు మళ్ళీ రివాల్వర్ ని కోటుజేబులోదాచుకున్నాడు.

"హలో!
టీవీలో మీరు చూపిస్తున్నహంతకుణ్ణి మా టీ కొట్టులో చూశాను సార్ 
బ్రిడ్జిదగ్గర  టీకొట్టు గుడెసెస్తంభానికి కాయిన్ బాక్సుంటుంది. నా పేరు వెంకటేష్ ...
ఆ యాభైలక్షలు నా కిప్పించండిసార్ "

మాటల్ని పదేపదే తలచుకుంటూ తనలోతానే ముసీముసినవ్వులు నవ్వుకుంటూ ..రివాల్వర్ ని తడిమిచూసుకుంటూ నడుస్తున్నాడు అతడు యమధర్మరాజులా.

***     **    *** ***
 టీ కొట్టువద్ద గుంపులు గుంపులుగా జనం.
జనం మధ్యలోంచి దూసుకెళుతోంది పోలీసుజీపు.
జీపులో పట్టుబడ్డ దారుణమైన హంతకునిగా పేరుగాంచిన యువకుడు మృదుకర్ .

కానీ మృదుకర్ చంపింది తన తల్లిదండ్రులను హత్యచేయించిన ఒకప్పటి తన తండ్రిబిజినెస్ పార్ట్ నర్ ధనపతినే అన్న రహస్యం ఎవ్వరికీతెలీదు.

టీకొట్టువద్దకు రమ్మంటూ యాభైలక్షలకోసం ఫోన్ చేసింది  కూడా వెంకటెష్ కాదు అన్న రహస్యం ఎవ్వరికీతెలీదు.
ఫోన్ చేసింది హంతకుడు మృదుకరే అన్న రహస్యంకూడా ఎవ్వరికీతెలీదు.

టీ కొట్టులో తాగిన టీకి డబ్బులిస్తూ వెంకటేశ్ తో
"ఇకపై చెయ్యిచాచకు డబ్బుకోసం!చెయ్యెత్తుచాలు" అంటూ మృదుకర్ అన్న మాట వెనుక వున్న
రహస్యంకూడా ఎవ్వరికీతెలీదు చివరికి వెంకటేశ్ కికూడా.?

పోలీసులతో వచ్చిన కోటీశ్వరుడు ఎవరయ్యా టీకొట్టువెంకటేశ్ అంటే చెయ్యి ఎత్తాడంతే!

ఎత్తిన చేతికి అందింది యాభైలక్షలచెక్కు అన్న రహస్యం ..అతడికి తెలిసింది టీవీ లో చూశాకే.

మనిషిబుద్ధి అదో ఊసరవెల్లి 
దేవునిగా క్రూరునిగా మార్చుకుంటుంది పరిస్థితులకు అనుకూలంగా.

          హామీ పత్రము

ఆర్యా,
ఈ కథ


"ఏమనుకోనూ...నిన్నేమనుకోనూ?" 


నా స్వీయ రచన. 
అనువాదం కాదు. కాపీకాదు.
అనుసరణకాదు. 
ప్రసారం కాలేదు. ప్రచురణ కాలేదు.

ఇట్లు
రచయిత
గాదిరాజు సందీప్ వర్మ

చిరునామా
Gadhiraju.sandeep
M tech
sr. engineer
c/o  sandeep clinic
main road 
near Markandeya Temple
Yadiki
Anantapur Dist
cell: 9703316760

Comments