*సమస్యను పూరించండి*
భోలేగా తుమునా కహానియగు
       మామూలఢ్ఢు  నీకేటికిన్
శా:
పాలింపన్ దగునేతవీవని ప్రజల్ పక్కాగనిన్నమ్మి జై
బోలోయంచుధరిత్రినీకొసగెసద్బుద్ధిన్ వరాలివ్వుమా
చాలున్ సాకులు మాటతప్పుటకుయాశల్ దీర్పగాబూనుమా
భోలేగా తుమునా కహానియగు
       మామూలఢ్ఢు  నీకేటికిన్
*గాదిరాజు మధుసూదనరాజు*
😘😅😄😃🤣😂😁😍😎😀
దత్తపది......
మూల్యము......నాలుగు పాదాలలో
పాదాదిని మూల్యము అని రావాలి.
ఉ:
మూల్యము కట్టగాతగునె ముద్దుగపెంచిన తల్లిప్రేమకున్
మూల్యముచెల్లుతప్పదటుమూర్ఖతజేసినతప్పుకుప్పకున్
మూల్యమమూల్యమమ్మతనమున్నతమీపరమాత్మసృష్టిలో
మూల్యముభక్తిసంస్తుతులుమ్రొక్కులుపద్యకళానిధీస్థలిన్
*గాదిరాజు మధుసూదనరాజు*
😘😅😄😃🤣😂😁😍😎😀
[11/7, 8:51 AM] Madhusudan Raju: తుమ్ భోలేగా కహాని =కథ
నీవు బాగానే చెబుతావు. కథలు చెప్పటం మాములే..అడ్డునీకేముంది  వాగ్దానాలు తీర్చడానికి అని దేశీయ (వా)బాణీలో తమాషాగా పూరించాను.
Now Iam on duty AP కంటివెలుగు🙏
[11/7, 10:05 AM] Madhusudan Raju: ✅🌺👌👏🤚🕉🤣😬🙏🌸
*సమస్యను పూరించండి*
సమస్య విరుపు చూడండి........
           ..                                      శం
భో,లే,గాతుము
నాక హానియగు మామూలడ్డు
నీకేటికిన్
పాలన్ సంద్రమునందునిద్రలొకొ యుత్పాతాల్ హరీ!లోకముల్
ప్రేలెన్ రాక్షసదండయాత్రలయె
వ్యాప్తిన్ బొందెభీభత్సమే
ఆలంబుండె వశిష్ఠగోత్రజుడనాహ్వానింతుక్షాత్రంబహం
భో,లే,గాతుము
నాక హానియగు మామూలడ్డు
నీకేటికిన్
*గాదిరాజు మధుసూదనరాజు*
నేను క్షత్రియుడను రఘువంశీయుడను..గోత్రప్రవర చెప్పి శ్రీహరిని రాక్షసులపైయుద్ధంచేస్తాం రమ్మని ఆహ్వానం

Comments

  1. సమస్యాపూరణం

    అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్

    రవళింపన్ చెవులందుదుష్టమశకారావంబు లారీలుప
    ద్రవమేదోఘటియిల్లునోయనగరౌద్రారావముల్ చేయగా
    నవరోధంబులరోడ్డుమధ్యసభధ్వన్యానందసంభూతమై
    అవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్

    గాదిరాజుమధుసూదనరాజు

    ReplyDelete
  2. క్షత్రియమహిళాశిరోమణి సహస్రకవిరత్న కవిభూషణశ్రీమతి జి సందిత గారి రచనలు మనకు గగ్వకారణాలు
    లింక్ https://vihanga.com/?author=74

    ReplyDelete

Post a Comment